సోమేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు
NLR: మహాశివరాత్రి సందర్భంగా కందుకూరులోని శ్రీ స్కందపురి సోమేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు అసౌకర్యం లేకుండా దర్శనం కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు.