VIDEO: కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఎప్పుడు..?
ELR: నూజివీడు పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని జగన్ పాలనలో విస్తృత ప్రచారం చేశారు. మూడేళ్లు గడుస్తున్న ఇప్పటికీ కేంద్రీయ విద్యాలయం ఊసు లేకపోవడం పట్ల పలు ప్రజాసంఘాల నాయకులు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు పై అధికారులు సరైన ప్రకటన చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.