'దొడ్డు వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి'

'దొడ్డు వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి'

WNP: రైతులు పండించిన దొడ్డు వడ్లను వెంటనే కొనుగోలుచేయాలని రైతుసంఘం జిల్లాకార్యదర్శి పరమేశ్వరచారి డిమాండ్ చేశారు. చిమనగుంటపల్లి సింగల్ విండో కేంద్రాన్ని రైతుసంఘం నేతలు సోమవారం సందర్శించారు. 20రోజుల క్రితం రైతులు కేంద్రానికి తీసుకువచ్చిన వడ్లను తేమశాతం వచ్చిన కొనుగోలు చేయడంలేదన్నారు. అధికారులు స్పందించి వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని ఆయన కోరారు.