'దొనకొండను కలపాలని ప్లకార్డులతో నిరసన'
ప్రకాశం: మార్కాపురం జిల్లాలో దొనకొండ, కురిచేడు మండలాలను కలపాలని ఇవాళ ఎమ్మార్పీఎస్ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. MRPS దండోరా రాష్ట్ర అధ్యక్షులు గుంటు పోలయ్య మాట్లాడుతూ.. 25Km దూరంలో వున్న దొనకొండ, కురిచేడును కలిపితే పశ్చిమ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు.