అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్
అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్ ఇచ్చింది. యూఎస్‌ను స్వతంత్రగా వీడితే 2,600 డాలర్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే, ఉచిత విమాన టికెట్లు ఇస్తామని తెలిపింది. ఇందుకోసం కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. 2025 జనవరిలో ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 22 లక్షల మంది దీన్ని ఉపయోగించుకున్నట్లు వెల్లడించింది.