VIDEO: జాతరలలో ఎడ్ల బండ్ల ప్రదర్శన
MDK: పాపన్నపేట మండలం యూసఫ్ పేట ఆరేపల్లి గ్రామంలో అనంత పద్మనాభ స్వామి జాతర మహోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారంగా గ్రామంలో రైతులందరూ తమ ఎడ్లబండ్లను అందంగా అలంకరించి వరి పంట పొలాల మధ్యలో ఉన్న గుడి చుట్టూ ఎడ్ల బండ్లను ప్రదర్శించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.