VIDEO: ట్రైబల్ హాస్టల్ ముందు విద్యార్థినుల ఆందోళన

VIDEO: ట్రైబల్ హాస్టల్ ముందు విద్యార్థినుల ఆందోళన

జనగామ: పాలకుర్తి(మం) గూడూరు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో వసతుల కొరతపై విద్యార్థినులు సోమవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పరిష్కారం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు సరిగా లేవని పేర్కొంటూ తక్షణ చర్యలు తీసుకోవాలని, సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.