VIDEO: కరెంట్ మోటార్లు దొంగల ముఠా అరెస్ట్
WGL: వ్యవసాయ బావులు, అమర్చిన కరెంట్ మోటార్లను దొంగిలిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను WGL సీసీఎస్ పోలీసులు కమలాపూర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో 7 మంది నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి రూ. 6, 60, 000 విలువ గల 71 కరెంట్ మోటార్లు, దొంగతనాలకు ఉపయోగించిన ఒక ఆటో ట్రాలీ, ఒక కారు, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.