రేపే పల్స్ పోలియో: డాక్టర్ రంజిత
CTR: పల్స్ పోలియో కార్యక్రమం కింద పుంగనూరు పరిధిలో 13 వేల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు రంజిత శనివారం తెలిపారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్బన్‌లో 6,402, రూరల్‌లో 62,950 మంది పిల్లలను గుర్తించినట్లు చెప్పారు. 57 కేంద్రాలతో పాటు రెండు ట్రాన్సిట్ పాయింట్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.