VIDEO: టీడీపీలో మొదలైన ఆధిపత్య పోరు

VIDEO: టీడీపీలో మొదలైన ఆధిపత్య పోరు

KDP: టీడీపీలో ఆధిపత్య పోరు మొదలైంది. 4వ డివిజన్ పరిధిలో పాత టీడీపీ నేతలకి, వైసీపీ నుంచి వచ్చిన వలస నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ డివిజన్ ఇంఛార్జ్ ఆవుల వెంకటేష్‌‌పై 20 మంది కర్రలతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.