ఘాట్ రోడ్డులో వెళుతున్నారా..?
తిరుమలలో సోమవారం నుంచి సుమారు 2 నెలలపాటు డౌన్ ఘాట్ రోడ్‌పై మిల్లింగ్ వర్క్, బీటీ రోడ్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనుల నేపథ్యంలో ఘాట్ రోడ్‌లో ప్రయాణించే భక్తులు, తిరుమల-తిరుపతి స్థానికులు అప్రమత్తంగా.. నిదానంగా వాహనాలు నడపాలని సూచించారు. ప్రత్యేకంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తిరుమల ట్రాఫిక్ పోలీసులు కోరారు.