మాజీ ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసిన అధికారులు

PLD: ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతుండటాన్ని నిరసిస్తూ మంగళవారం ఆర్డీఓ కార్యాలయాల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో రైతు ధర్నాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ధర్నాకు మద్దతు కూడగడుతున్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్లలో పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయన ఇంటిని చుట్టుముట్టి, బయటకు రానీయకుండా అడ్డుకున్నారు.