నేడు ఉచిత వైద్య శిబిరం
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని కజిన్స్ వీధిలో ఉన్న ENT పాయింట్‌లో ఇవాళ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు విశ్రాంత జిల్లా వైద్యశాల సమన్వయ అధికారి డాక్టర్ పాల్ రవికుమార్ గురువారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చెవి, ముక్కు, గొంతు, దంత, క్యాన్సర్, తల మెదడుకు సంబంధించిన వ్యాధులకు ఉచితంగా చికిత్సలు, మందులు అందిస్తామన్నారు.