పర్వత ప్రాంత రక్షణ పరికరాల్లో భారత్ ఆత్మనిర్భర్

పర్వత ప్రాంత రక్షణ పరికరాల్లో భారత్ ఆత్మనిర్భర్

భారత సైన్యం పర్వత ప్రాంతాల్లో వినియోగించే పరికరాలు, ప్రత్యేక దుస్తుల్లో 97% వరకు దేశంలోనే తయారవుతున్నాయని సైన్యం ప్రకటించింది. ముఖ్యమైన 57 రకాల దుస్తులు, ఇతర పరికరాలలో 55 రకాలను (సుమారు 97%) ప్రస్తుతం స్థానికంగానే ఉత్పత్తి చేస్తున్నారు. ఇది రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా సైన్యం సాధించిన గొప్ప మైలురాయి. ఈ వివరాలను ADGPI అధికారికంగా ప్రకటించింది.