నేడు పుట్టపర్తికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాక
SS: సత్యసాయి శత జయంతి వేడుకల కోసం CM చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేశ్ నేడు పుట్టపర్తికి రానున్నారు. వీరు ప్రత్యేక విమానాల్లో సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి చేరుకుని, రాత్రికి ప్రశాంతి నిలయంలో బస చేస్తారు. బుధవారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో కలిసి జరిగే కార్యక్రమంలో వారు పాల్గొంటారు.