'మానవ ప్రగతి సైన్స్‌తోనే ముడిపడి ఉంది'
Srcl: మానవ ప్రగతి సైన్స్ తోనే ముడిపడి ఉందని మండల విద్యాధికారి వినయ్ కుమార్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో జన విజ్ఞాన వేదిక చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ప్రశ్నా పత్రాన్ని ఆవిష్కరించారు.