'బెదిరింపు లేఖ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం'
ASF: చింతలమానేపల్లి మండలం రనవెల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థికి వచ్చిన బెదిరింపు లేఖ ఘటనపై విచారణ చేస్తున్నట్లు SP నితిక పంత్ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే దోషులను పట్టుకొని దోషులపై తగు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ప్రజలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, ఎక్సెజ్ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామన్నారు.