కుమార్తె కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు

ELR: నూజివీడు మండలం ముకొల్లుపాడు గ్రామం నుండి గత నెల 4వ తేదీన వెలగలపల్లి అత్తవారింటికి వెళ్లిన తన కుమార్తె కనిపించడం లేదంటూ కంచర్ల బాబురావు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై జ్యోతి బసు ఆదివారం తెలిపారు. వెలగలపల్లి నుండి గత నెల 2వ తేదీన వచ్చి ,4వ తేదీన వెళ్లినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడని చెప్పారు. తండ్రి ఫిర్యాదుతో నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.