బావతోనూ కాపురం చెయ్యాంటూ అత్తమామల వేధింపులు
ELR: జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతోనే కాదు బావతోనూ కాపురం చెయ్యాంటూ అత్తమామలు చిన్నకోడలను వేధించారు. బావకు పిల్లాలు లేరు కాబట్టి బావతో పిల్లలు కనాలన్నారు. దీనికి కోడలు ఒప్పుకోకపోవడంతో గదిలో బందించి అత్తమామలు టార్చర్ చేశారు. స్థానికులు సహయంతో ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో ఘటన స్థాలనికి పోలీసులు చేరుకొని మహిళను రక్షించారు.