ఎలికట్టలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్

ఎలికట్టలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్

RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయడానికి ఆసక్తిగా పోలింగ్ బూత్‌లకు చేరుకుంటున్నారు. ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 2200 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.