నాకు మమ్ముట్టి అనే పేరు పెట్టింది ఇతనే: హీరో

నాకు మమ్ముట్టి అనే పేరు పెట్టింది ఇతనే: హీరో

మలయాళ స్టార్ మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి అనే విషయం తెలిసిందే. అయితే తన పేరు మమ్ముట్టిగా ఎలా మారిందో సదరు హీరో చెప్పారు. 'కాలేజీలో నా అసలు పేరు ఎవరికీ తెలియదు. నా పేరు ఒమర్ షరీఫ్ అని చెప్పేవాడిని. ఒకరోజు నా పేరు అందరికీ తెలిసిపోయింది. అప్పుడు నా ఫ్రెండ్ శశిధరన్.. నీ పేరు షరీఫ్ కాదు మమ్ముట్టి అని అన్నాడు. అప్పటి నుంచి నాపేరు మమ్ముట్టిగా మారిపోయింది' అని అన్నారు.