'ప్రజా ఫిర్యాదుల వేదికను వినియోగించుకోండి'

'ప్రజా ఫిర్యాదుల వేదికను వినియోగించుకోండి'

TPT: తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఎన్. మౌర్య ఐఏఎస్ తెలిపారు. మార్చి 9న ఉదయం 10 నుంచి 2 గంటల వరకు ఫిర్యాదుల వేదిక, 10.30 నుంచి 11.30గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.