ఓ.ఎన్.కొత్తూరులో మొక్కజొన్న విత్తనాల పంపిణీ

ఓ.ఎన్.కొత్తూరులో మొక్కజొన్న విత్తనాల పంపిణీ

CTR: రైతులు సబ్సిడీతో పంపిణీ చేస్తున్న మొక్కజొన్న విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ జడ్పీటీసీ బేటప్ప నాయుడు అన్నారు. గురువారం గుడిపల్లి మండలం ఓన్నపనాయుని కొత్తూరు సచివాలయంలో రైతులకు మొక్కజొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు మొక్కజొన్న విత్తనాలు సబ్సిడీతో ఇవ్వడంతో ఆర్థిక భారం తగ్గుతుందన్నారు.