'రైతులకు గౌరవం దక్కేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది'
E.G: రాష్ట్ర చరిత్రలో ఇది గోల్డెన్ డే అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం పోరాడిన రైతుల త్యాగాలకు గౌరవం దక్కేలా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.