చెరువులా మారిన షర్బతి కెనల్ రహదారి
NZB: బోధన్‌లో బేలాల్ చెరువు నుంచి వచ్చే షర్బతి కెనాల్ నిండిపోవడంతో రహదారులపైకి నీరు చేరి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కెనాల్ ఎత్తు తక్కువగా ఉండటం, చెత్త పేరుకుపోవడం వల్ల నీరు కాలువ గుండా ప్రయాణించకుండా పూర్తిగా రహదారిపైకి వస్తోందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.