పంట కాలువలో గుర్తులేని మృత దేహం లభ్యం
NTR: జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట పరిధిలో 26 ఏళ్ల గుర్తుతెలియని మహిళ మృతదేహం పంట కాలువలో లభించింది. రైతు నాగరాజు ఈ దేహాన్ని గమనించి పోలీసులు సమాచారమిచ్చారు. సీఐ వెంకటేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృతురాలు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.