నిరుద్యోగులకు ఉచిత టూవీలర్ సర్వీస్ శిక్షణ
SDPT: హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగులకు ఉచిత టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ ట్రైనింగ్ కల్పించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి తెలిపారు. ఈడి సెల్ ఆధ్వర్యంలో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సహకారంతో 50 రోజుల శిక్షణ జరుగుతుంది. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి అందిస్తామని చెప్పారు. శిక్షణ పూర్తైన వారికి NSDC సర్టిఫికెట్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.