సత్తాచాటిన కరీంనగర్ జిల్లా వాసి
KNR: గట్టుబూత్కూర్ గ్రామానికి చెందిన కామరపు శివాజీ ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), వరంగల్‌లో సీటు సాధించి జిల్లా స్థాయిలో ప్రతిభ చాటారు. శివాజీ ఎన్ఐటీ వరంగల్లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పి.హెచ్.డి. (డాక్టరేట్) చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిభను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు, అందరూ ప్రశంసించారు.