ఎంపీ సమక్షంలో బీజేపీలోకి చేరికలు

ఎంపీ సమక్షంలో బీజేపీలోకి చేరికలు

NZB: జిల్లాలోని కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం సాయంత్రం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎంపీ వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ అన్నారు.