పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: DEO
చిత్తూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఈ నెల 16న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లాలో 20,830 రెగ్యులర్, 1,951 ప్రైవేట్ విద్యార్థుల కోసం 129 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు 30 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 12 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.