BREAKING: తగ్గిన బంగారం ధర
TG: హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,030 తగ్గి రూ.1,59,660కు చేరగా.. ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ. 950 తగ్గి రూ.1,46,350గా పలుకుతోంది. మరోవైపు వెండి ధర కిలోపై రూ. 10వేలు తగ్గి రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది.