'ప్లాస్టిక్ సంచులు వద్దు గుడ్డ సంచులు ముద్దు'

NLR: కావలిలోని రైతు బజార్ వద్ద జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు ఉచిత గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సంచులలో వేడి పదార్థాలు వేస్తే అంతులో రసాయనాలు కరిగి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని జన విజ్ఞాన వేదిక సభ్యులు తెలిపారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, మనకి ఎంతో అపాయం పొంచిఉంది అన్నారు. ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులు వాడాలని కోరారు.