పోలీసులపై కాల్పులకు యత్నం.. నిందితుడి అరెస్ట్

పోలీసులపై కాల్పులకు యత్నం.. నిందితుడి అరెస్ట్

AP: విజయవాడలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్ 'వజ్ర ప్రహార్' తనిఖీల్లో ఉత్కంఠ చోటుచేసుకుంది. బస్టాండ్ సమీపంలోని హోటల్‌లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా, WGLకు చెందిన మురళి అనే వ్యక్తి రివాల్వర్‌తో పోలీసులపై కాల్పులకు యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే బెంగళూరు నుంచి డ్రగ్స్ తరలిస్తున్న మరో నలుగురిని అరెస్ట్ చేశారు.