ఈ నెల 28న బండలాగుడు పోటీలు

ఈ నెల 28న బండలాగుడు పోటీలు

వనపర్తి మండలం పెద్దగూడెంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 28న అంతర్రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.40 వేలు, రెండో బహుమతి రూ.30 వేలతో పాటు మొత్తం ఆరు నగదు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎడ్ల యజమానులు తరలిరానున్నారు.