కొనకనమిట్లలో గుర్తు తెలియని మృతదేహం కలకలం
ప్రకాశం: కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల పవర్ ఆఫీస్ వెనుక వైపు గుర్తు తెలియని మృత దేహాం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆయన పక్కన పురుగుల మందు డబ్బా ఉండడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.