VIDEO: అమలాపురంలో తప్పిన పెను ప్రమాదం
కోనసీమ: అమలాపురంలో పెను ప్రమాదం తప్పింది. గుడి దగ్గర వెలిగించిన కార్తీక దీపాలు బైక్‌కు తగలడంతో ఈ సంఘటన జరిగింది.
బైక్ నుంచి పెట్రోల్ లీక్ అయి కార్తీక దీపాలకు తగిలి, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. దీంతో బైక్ పూర్తిగా కాలిపోయింది. ఈ క్రమంలో మంటలు పక్కనే ఉన్న ఒక గుడిసెకు కూడా వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.