డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: ఎస్పీ
NGKL: జిల్లాలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ హెచ్చరించారు. యువత మత్తుకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన కోరారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే 'డయల్ 100'కు తెలపాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.