దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

KNR: కరీంనగర్ పట్టణంలోని గణేశ్ నగర్ హనుమాన్ చౌరస్తా వద్ద పంచముఖ హనుమాన్ మిత్ర మండలి ఆధ్వర్యంలో జరగనున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల పోస్టర్‌ను సోమవారం కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు పి. సుజాత రెడ్డి, సీనియర్ నాయకులు బేతి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.