మూతబడిన కంపెనీలో చోరీ
VSP: గాజువాక ఆటోనగర్‌లో గత 6 నెలల నుంచి మూతబడిన సన్‌రైజ్ కంపెనీలో చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సమాచారం అందుకున్న దువ్వాడ క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ చోరీలో కంప్యూటర్లు, విద్యుత్ మోటార్లు, ఎస్.ఎస్.కాయిల్స్ చోరీకి గురైనట్లు యజమాని తెలిపారు.