25న కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకారం
VSP: ఈనెల 25న ఉదయం 10 గంటలకు విశాఖ పార్లమెంట్ కార్యవర్గం ప్రమాణస్వీకారం నిర్వహించాలని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్, ప్రధాన కార్యదర్శి లోడగల కృష్ణ తెలిపారు. ఈమేరకు ఇవాళ వారు టీడీపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అలాగే 23న నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని వేడుకలు, రక్తదాన శిబిరం నిర్వహిస్తామన్నారు.