'కైవల్య రెడ్డికి ఘనంగా సత్కరణ'
E.G: అంతరిక్ష యాత్రకు ఎంపికైన కైవల్య రెడ్డిని నిడదవోలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. క్లబ్ తరఫున ఆమెకు రూ. 50 వేల నగదు పారితోషికాన్ని అందజేశారు. భవిష్యత్తులో నిడదవోలుకు మంచి పేరు తీసుకురావాలని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కరుటూరి చౌదరి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొత్తపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.