CMRF చెక్కులను పంపిణీ చేసిన MLA

GNTR: రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పొన్నూరు మండలం చింతలపూడిలో శనివారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.