VIDEO: ట్రాక్టర్ ఢీకొనడంతో వృద్ధుడికి గాయాలు
అన్నమయ్య: కేవీ పల్లి మండలం సొరకాయలపేట గ్రామం సమీపంలో మిన్నంరెడ్డి గారి పల్లె వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడు సాహెబ్ (64)ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆయన కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే 108 అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.