గర్బిణీకి 108లో ప్రసవం
అల్లూరి: కొయ్యూరు మండలం పిట్టచలం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి అనే నిండు గర్భిణికి శనివారం పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు రాజేంద్రపాలెం పీహెచ్‌సీ 108 అంబులెన్సు వాహనం ఈఎంటీ ఈశ్వరరావు, పైలెట్ వర ప్రసాద్ అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఆశా, అంగన్వాడీ సహాయంతో, 108 సిబ్బంది గర్భిణికి ప్రసవం చేశారు.