నేడు శబరి మాత ఆలయంలో 55వ వార్షికోత్సవ వేడుకలు

నేడు శబరి మాత ఆలయంలో 55వ వార్షికోత్సవ వేడుకలు

KMR: తాడ్వాయి మండల కేంద్రంలోని శబరి మాతా ఆశ్రమంలో దత్తాత్రేయ జయంతి సందర్భంగా 55వ వార్షిక మహోత్సవాలను ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. గురువారం దత్తాత్రేయ పౌర్ణమి సందర్భంగా గోమాత పూజ, ధ్వజారోహణం, భిక్షాటన, వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, డోలారోహణ ఉత్సవం, రథోత్సవం ఉంటుందన్నారు. శుక్రవారం గుట్టపై శబరీ మాత పాదుకా పూజా నిర్వహిస్తారు.