వర్షపు నీటిలో కాలనీవాసుల అవస్థలు
NZB: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పలు కాలనీల్లో వర్షపు నీటితో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. పట్టణ కేంద్రంలోని కొటార్మూర్ శివారులో 6వ వార్డులో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి కాలనీలో వర్షపు నీరుతో ఇబ్బందులు పడ్డట్లు కాలనీవాసులు వాపోయారు. పలుమార్లు మున్సిపల్ అధికారులకు తమ సమస్యను విన్నవించిన నిర్లక్ష్యం వహించారని కాలనీవాసులు వాపోతున్నారు.