VIDEO: దొంగతనానికి వచ్చి.. బాత్రూంలో దాక్కున్న దొంగ..!

VIDEO: దొంగతనానికి వచ్చి.. బాత్రూంలో దాక్కున్న దొంగ..!

WGL: వరంగల్ నగరంలోని శివనగర్‌లో మంగళవారం ఓ దొంగ చోరీకి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. రాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రహరీ గోడ దూకి ప్రవేశించిన దొంగను సీసీ కెమెరా గుర్తించింది. ఇంట్లో వారి అలికిడికి భయపడిన దొంగ బాత్రూంలో దాక్కున్నాడు. దొంగను గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్నారు.