చరిత్ర సృష్టించిన భారత షూటర్
ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న ISSF వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సామ్రాట్ రాణా చరిత్ర సృష్టించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. దీంతో భారత్ తరఫున ఈ విభాగంలో ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి క్రీడాకారుడిగా నిలిచాడు. ఇదే ఈవెంట్‌లో మరో భారత షూటర్ వరుణ్ తోమర్ కాంస్య పతకం సాధించాడు.