7న శ్రీకూర్మనాథ ఆలయం మూసివేత

7న  శ్రీకూర్మనాథ ఆలయం మూసివేత

SKLM: గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రాన్ని ఈనెల 7న భాద్రపద పౌర్ణమి చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈవో కె.నరసింహనాయుడు, ప్రధాన అర్చకులు సిహెచ్, సీతారాం నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తున్నామన్నారు. సంప్రోక్షణ అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపారు.