భార్యకు పెళ్లి చేసి.. భర్త ఆత్మహత్య.!

భార్యకు పెళ్లి చేసి.. భర్త ఆత్మహత్య.!

ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మనస్తాపానికి గురై ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తుపల్లికి చెందిన షేక్ గౌస్‌కు 8 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. అయితే, ఇటీవల తన స్నేహితుడితో భార్య ప్రేమలో పడింది. దీంతో వారిద్దరికీ షేక్ గౌస్‌ వివాహం చేశాడు. ఆ వివాహాన్ని తాను తట్టుకోలేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అతడి కుటుంబం విషాదంలో మునిగింది.